Share News

మెరుగైన జీవితం కోసం వెళ్లి మృత్యువాత పడ్డారు: కుటుంబ సభ్యులు

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:40 PM

జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని కేలంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు దీపక్ రాత్రే (24), భూపేంద్ర బైనా(28) మరణించారు. మెరుగైన జీవనం కోసం ఉపాధిని వెతుక్కుంటూ జమ్మూ కశ్మీర్ వెళ్లిన వారు మృత్యువాత పడ్డారని ఇరు కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

మెరుగైన జీవితం కోసం వెళ్లి మృత్యువాత పడ్డారు: కుటుంబ సభ్యులు

రాయ్‌పూర్, ఆగస్టు 02: జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని కేలంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు దీపక్ రాత్రే (24), భూపేంద్ర బైనా(28) మరణించారు. మెరుగైన జీవనం కోసం ఉపాధిని వెతుక్కుంటూ జమ్మూ కశ్మీర్ వెళ్లిన వారు మృత్యువాత పడ్డారని ఇరు కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీపక్‌కు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడని తెలిపారు. ఉపాధి కోసం ఏడు, ఎనిమిది నెలల క్రితమే దీపక్‌ తన భార్యతో కలిసి శక్తి జిల్లాలోని బుందేలి గ్రామం నుంచి జమ్మూ కశ్మీర్ వెళ్లారని అతడి మామయ్య హల్దర్ రాత్రే వెల్లడించారు. అలాగే అతడికి దివ్యాంగ సోదరుడితోపాటు వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా ఉందని చెప్పారు.


దీపక్ తండ్రి గతంలోనే మరణించారని గుర్తు చేశారు. దీపక్ మరణంతో.. ఆ కుటుంబం కష్టాల్లోకి బలవంతంగా నెట్టివేయబడిదని ఆవేదన వ్యక్తం చేశారు. అతడి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

భూపేంద్ర భైనా స్వస్థలం సారంగఢ్ బిలాయిగఢ్ జిల్లాలోని చుయియా గ్రామం నుంచి మూడు నెలల క్రితమే భార్యతో కలిసి ఉపాధి కోసం జమ్మూ కాశ్మీర్ వెళ్లాడని అతడి కుటుంబ సభ్యులు చెప్పారు. అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో వలస కార్మికులుగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు.


భూపేంద్ర మృతిపై అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. అతడికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు. ఆ బాలుడిని అమ్మమ్మ వద్ద వదిలి వీరు జమ్మూ కశ్మీర్ వెళ్లారని వివరించారు. అతడి పార్థీవ దేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు జమ్మూ కశ్మీర్ అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సునీల్ శర్మ వెల్లడించారు. ఈ ఉగ్రవాదుల కాల్పులను ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఖండించారు.


ఇది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కేలం ప్రాంతంలో ఇసుక బట్టీల్లో వీరు కార్మికులుగా పని చేస్తున్నారు. అక్కడికి వచ్చి ఉగ్రవాదులు.. వారి కులాలు, మతాలను ప్రశ్నించారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో దీపక్ కుప్పకూలి మరణించారు. భూపేంద్ర మాత్రం సౌరాలోని స్కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కుట్ర.. ప్రియురాలి సోషల్ మీడియాతో దొరికిపోయిన ఉగ్రవాది!

బెంగాల్ ఉగ్ర మోడ్యూల్ గుట్టురట్టు.. జంతర్ మంతర్ ధర్నాలో దాడికి ఉగ్రవాది కుట్ర!

For More National News And Telugu News

Updated Date - Aug 02 , 2026 | 02:10 PM