బెంగాల్ ఉగ్ర మోడ్యూల్ గుట్టురట్టు.. జంతర్ మంతర్ ధర్నాలో దాడికి ఉగ్రవాది కుట్ర!
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:51 PM
పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన మొహమ్మద్ హమీమ్ మోండల్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో మోండల్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన మొహమ్మద్ హమీమ్ మోండల్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో పాటు పాకిస్తాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో మోండల్‌కు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. ఐజీ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) గౌరవ్ శర్మ శనివారం కోల్‌కతాలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. గౌరవ్ శర్మ తెలిపిన వివరాల మేరకు..
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమాల్లో దాడులు చేయడానికి మొహమ్మద్ హమీమ్ మోండల్ ప్లాన్ చేశాడు. దాడుల కోసం పోలీసు యూనిఫాం సంపాదించేందుకు ప్రయత్నించాడు. పలువురు పోలీసులు, రాజకీయ నాయకులను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. షాజాద్ భట్టి గ్యాంగ్‌కు చెందిన 'రాణా', 'ఉజైర్', 'ఆబిద్ జట్ 333', 'హమద్' హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు.
వీరంతా మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై.. ఆ తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా సందేశాలు పంపుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజకీయ నాయకులను 'హనీ-ట్రాప్' ద్వారా బ్లాక్ మెయిల్ చేసి, వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయడానికి మొహమ్మద్ హమీమ్ మోండల్ ప్లాన్ చేశాడు. ఓ ప్రముఖ నాయకుడి కుమారుడిని అపహరించడానికి కూడా ప్లాన్ చేశాడు.
ఇవి కూడా చదవండి
ఇంట్లో దోమల కాయిల్ వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు రావచ్చు
ఏపీ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు: సీఎం చంద్రబాబు