మద్దతు వెనక్కి తీసుకుంటే, పవార్ కాళ్లు మొక్కుతా: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:45 PM
డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) తన మద్దతును ఉపసంహరించుకుంటే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాళ్లు మొక్కి క్షమాపణ చెబుతానని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినందువల్లే పవార్‌ను వెన్నుపోటుదారుగా తాను విమర్శించానని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) తన మద్దతును ఉపసంహరించుకుంటే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కాళ్లు మొక్కి క్షమాపణ చెబుతానని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ అన్నారు. ఆదివారం ముంబైలో మీడియాతో ఆయన మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇచ్చినందువల్లే పవార్‌ను వెన్నుపోటుదారుగా తాను విమర్శించానని తెలిపారు. ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు పవార్ మద్దతును వెనక్కి తీసుకుంటే, ఆయన ఏం చెబితే అది చేస్తానని పేర్కొన్నారు. తనను రాజకీయాల నుంచి తప్పుకోవాలని పవార్ ఆదేశిస్తే, ఆ పని చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సెక్యులర్ భావజాలానికి సంబంధించి పవార్ ఇమేజ్ తమ హృదయాల్లో అలాగే ఉందన్నారు.
కాగా.. డీలిమిటేషన్ బిల్లుకు శనివారం ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో శరద్ పవార్‌పై విజయ్ వడెట్టివార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘మహారాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర శరద్ పవార్‌కు ఉంది. ప్రజలకు పవార్ ఫ్యామిలీ ఎప్పుడూ వెన్నుపోటు పొడిచింది. అంతేకాకుండా పవార్‌ది అధికార దాహం. డీలిమిటేషన్‌కు మద్దతు ఇచ్చి పవార్ తనది కాని స్థానానికి వెళ్లిపోయారు. అధికారం లేకుండా పవార్ కుటుంబం బతకలేదు. వారికి ఒక భావజాలం అనేది లేదు. ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడిన వారి పేర్లను చరిత్రలో రాస్తే, అందులో శరద్ పవార్ ఫ్యామిలీ కూడా ఉంటుంది’ అని విజయ్ వ్యాఖ్యానించారు. కాగా.. ప్రస్తుతం ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరద్ పవార్‌తో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ అయ్యే అవకాశం ఉంది. డీలిమిటేషన్‌పై మద్దతును ఉపసంహరించుకోవాలని పవార్‌ను కోరే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!