ఓ చేతిలో తుపాకి.. మరో చేతిలో కర్రతో...
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:22 AM
చిక్కమగళూరు జిల్లాలోని ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న తమిళనాడు వలస కూలీలపై తోట యజమాని దాడి చేశారు.
వలస కూలీలను చావబాదిన కాఫీతోట యజమాని
చిక్కమగళూరు జిల్లాలో ఘటన
సోషల్ మీడియాలో వీడియో వైరల్
సొంతూరు వెళ్లి పోతామన్నందుకే: బాధితురాలు
బెంగళూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): చిక్కమగళూరు జిల్లాలోని ఓ కాఫీ తోటలో పనిచేస్తున్న తమిళనాడు వలస కూలీలపై తోట యజమాని దాడి చేశారు. ఓ చేతిలో తుపాకీ, మరో చేతిలో కర్ర పట్టుకుని ఐదుగురిని చితకబాదుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మల్లందూరు పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బసగోడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. భరత్‌కు చెందిన కాఫీతోటలో పనిచేసేందుకు తమిళనాడు నుంచి ఓ కుటుంబం వలస వచ్చింది. ఈ కుటుంబం తోటలోనే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కూలి సొమ్ము విషయంలో వాగ్వాదం జరగడంతో తోట యజమాని భరత్ ఒక చెత్తో తుపాకీ, మరో చేతితో కర్ర పట్టుకుని కూలీ దంపతులు, వారి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన మీనా అనే కార్మికురాలిని చిక్కమగళూరులోని మల్లేగౌడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ కుటుంబం కొంతకాలంగా కాఫీ తోటలో పనిచేస్తోందని, పనులు మానేసి సొంతూరు వెళ్లిపోతామని యజమానికి చెప్పడంతో గొడవ జరిగిందని మీనా చెప్పారు. అడ్వాన్స్ తక్షణమే తిరిగివ్వాలని డిమాండ్ చేస్తూ, యజమాని తమపై దాడి చేశారని తెలిపారు. ప్రాణభయంతో పరిగెడుతుంటే.. వెంటాడి మరీ కొట్టారని విలపించింది. ఈ గొడవలో తన చెవి కమ్మలు పడి పోయాయని చెప్పారు. దాడి ఘటనపై వీడియో వైరల్ కావడంతో యజమానిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మల్లందూరు పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి