ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
ABN , Publish Date - Nov 28 , 2026 | 02:56 PM
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 28: ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధులందరికీ భాగస్వామ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో స్పెషల్ ఆఫీసర్లు సమన్వయం చేసుకోనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.
మంత్రులు, స్పెషల్ ఆఫీసర్ల వివరాలు..
హైదరాబాద్ - పొన్నం ప్రభాకర్, జయేశ్ రంజన్
రంగారెడ్డి- శ్రీధర్‌బాబు, వికాస్‌రాజ్
కరీంనగర్- తుమ్మల నాగేశ్వరరావు, బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా
మెదక్ - వివేక్ వెంకటస్వామి, లోకేశ్‌కుమార్
నిజామాబాద్ - సీతక్క, యోగితా రాణా
నల్గొండ - అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, హరిచందన దాసరి
ఆదిలాబాద్ - జూపల్లి కృష్ణారావు, ఇలంబర్తి
వరంగల్ - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ ఆదిత్య
మహబూబ్‌నగర్ - దామోదర రాజనర్సింహ, గౌతమ్
ఖమ్మం - వాకిటి శ్రీహరి, అనుదీప్ దురిశెట్టి
ఇవి కూడా చదవండి...
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతుపై అద్దంకి దయాకర్ విమర్శలు
డిగ్రీతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
Read Latest Telangana News And Telugu News