21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ABN , Publish Date - Nov 28 , 2026 | 03:17 PM
సంగారెడ్డి జిల్లాలోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లారు. జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి మాజీ మంత్రి హాజరయ్యారు.
సంగారెడ్డి, నవంబర్ 28: జిల్లాలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నివాసానికి మాజీ మంత్రి హరీశ్ రావు వెళ్లారు. జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి మాజీ మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి- కోడలు పాలక్ పటేల్‌లను హరీశ్ రావు ఆశీర్వదించారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే ఇద్దరు నేతులు.. సుమారు 21 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. దీంతో ఇరువురు నేతల కలయిన రాష్ట్ర రాజీకాయాల్లో ఆసక్తికరంగా మారింది.

మా కలయికలో ఎలాంటి రాజకీయాలు లేవు: జగ్గారెడ్డి
‘2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు నేను, ఆయన కలిసి భోజనం చేసే వాళ్లం. ఆ తర్వాత నేను కాంగ్రెస్‌లోకి వచ్చాక.. మళ్లీ ఇప్పటి వరకు హరీశ్‌ను కలవలేదు. 21 ఏళ్ల తర్వాత మొదటిసారి మళ్లీ ఫ్యామిలీ ఫంక్షన్‌లో కలిశాము. కూతురి పెళ్లికి హరీశ్ రావును పిలవలేకపోయాను... కానీ ఈ ఫంక్షన్ మిస్ కావొద్దని ఆహ్వానించాను. మా ఇద్దరి కలయికలో ఎటువంటి రాజకీయాలు లేవు.. మా కలయికలో ఎటువంటి మతలబు లేదు. రాజకీయం...రాజకీయమే. హరీశ్ రావు బీఆర్‌ఎస్‌లో అగ్రనేత. నేను కాంగ్రెస్‌లో టాప్ లీడర్ కాకపోయినా ఓ స్థాయి లీడర్‌నే. అనేక ఫంక్షన్‌లకు ఆయన్ని పిలవలేకపోయాను. పదేళ్లు హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన్ని కలవలేదు’ అని జగ్గారెడ్డి అన్నారు. ఇక తాను.. జగ్గారెడ్డి ఏనాడు వ్యక్తిగతంగా విమర్శించుకోలేదని ఈ సందర్భంగా హరీశ్ రావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి...
డిగ్రీతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
Read Latest Telangana News And Telugu News