Share News

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:58 PM

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం లోక్ సభ 543 సీట్లు కాస్తా 816కు పెరగనున్నాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కీలక వివరాలను వెల్లడించారు.

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
Lok Sabha Delimitation

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది. అయితే, ప్రస్తుత జనగణనతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 543 సీట్లు కాస్తా 816కు పెరగనున్నాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ పార్లమెంటరీ వ్యవహారాలు, న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కీలక వివరాలను వెల్లడించారు.


ప్రతిపాదిత బిల్లు ప్రకారం ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయనే వివరాలను కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా తెలియజేస్తూ ఓ చిత్రాన్ని పంచుకున్నారు. దీని ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య, డీలిమిటేషన్ తర్వాత పెరగనున్న స్థానాల వివరాలను ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం 80 లోక్‌సభ సీట్లు ఉండగా.. డీలిమిటేషన్ తర్వాత అవి 120కి చేరనున్నాయి. మధ్యప్రదేశ్‌లో 29 ఉండగా.. 43కి పెరగనున్నాయి. అలాగే, మహారాష్ట్రలో ప్రస్తుతం 48 ఉండగా.. 72కి చేరుకోనున్నాయి. గుజరాత్‌లో 26 నుంచి 39కి, రాజస్థాన్‌లో 25 నుంచి 38కి పెరగనున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

గురుకులాలు, మదర్సాల విద్యపై జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

ప్రొటెక్ట్ అవర్ నైబర్స్.. వలసదారుల కోసం డెమొక్రాట్ల కొత్త బిల్లు..

Updated Date - Nov 28 , 2026 | 07:58 PM