Share News

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది భక్తుల మృతి

ABN , Publish Date - Nov 29 , 2026 | 09:43 AM

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్‌గఢ్ జిల్లాలోని రాంచీ-పాట్నా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 13 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది భక్తుల మృతి
Jharkhand Road Accident

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్‌గఢ్ జిల్లాలోని రాంచీ-పాట్నా జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 13 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన 14 మంది భక్తులు రాజరప్ప ఆలయంలో దర్శనం చేసుకునేందుకు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఈ క్రమంలో కుజు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పైంకీ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో నలుగురు పిల్లలు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు సహా మొత్తం 13 మంది మృతి చెందారు. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, తీవ్ర గాయాలతో రామ్‌గఢ్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఎస్‌యూవీలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతులంతా బీహార్‌లోని నలంద జిల్లా జంగరో గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఆలయ దర్శనం కోసం సంతోషంగా బయలుదేరిన 13 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


https://x.com/ians_india/status/2126842763849400645


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 09:50 AM