Share News

ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!

ABN , Publish Date - Nov 08 , 2026 | 10:42 AM

పశ్చిమ బెంగాల్‌లో ఓ మైనర్.. నర్సింగ్ హోమ్‌లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆ శిశువును కిటికీలోంచి బయటకు విసిరేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే...

ప్రసవించిన నిమిషాల్లోనే.. పసికందును విసిరేసిన బాలిక!

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రసవించిన కాసేపటికే ఓ బాలిక.. తన నవజాత శిశువును నర్సింగ్‌ హోమ్‌ టాయిలెట్ కిటికీలోంచి బయటకు విసిరేసినట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో పడిఉన్న ఆ శిశువును స్థానికులు గుర్తించి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించగా.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందింది.


పోలీసుల కథనం ప్రకారం.. 16 ఏళ్ల ఓ బాలికను ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఓ నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్లారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ శనివారం ఉదయం టాయిలెట్‌కు వెళ్లిన ఆమె.. అక్కడ ఎవరి సాయం లేకుండా ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నవజాత శిశువును కిటికీలోంచి బయటకు విసిరేసినట్లు నర్సింగ్‌ హోమ్‌ యాజమాన్యం ఆరోపించింది.


అయితే.. తమ కుమార్తె గర్భవతి అనే విషయం తమకు తెలియదని బాలిక తల్లి చెప్పుకొచ్చారు. కేవలం కడుపునొప్పి కారణంగానే ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చామని, ఉదయం నర్సింగ్‌ హోమ్‌ నుంచి ఫోన్‌ వచ్చాకే అసలు విషయం తెలిసిందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నర్సింగ్‌ హోమ్‌లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడం సహా బాలిక తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు షాక్.. ఐసెన్‌కాట్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

జపాన్‌లో భూప్రకంపనలు.. 22 మందికి గాయాలు!

Updated Date - Nov 08 , 2026 | 10:42 AM