Share News

వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యోగా శిక్షకుల మృతి

ABN , Publish Date - Sep 30 , 2026 | 02:45 PM

వియత్నాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిరువురూ యోగా శిక్షకులుగా అక్కడ విధులు నిర్వహిస్తుండేవారు.

వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యోగా శిక్షకుల మృతి

ఇంటర్నెట్ డెస్క్: ఉపాధి కోసం వియత్నాం వెళ్లిన ఇద్దరు భారతీయ యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ నెల 25న(శుక్రవారం) జరిగిన ఈ ప్రమదంలో జార్ఖండ్​​​​​​‌కు చెందిన రాజకుమార్‌ వర్మ(26), వినయ్‌ యాదవ్‌(23) అనే యోగా శిక్షకులు ప్రాణాలు కోల్పోయారు.

యోగా క్లాసులు ముగించుకుని బైక్‌పై తిరిగొస్తుండగా.. వర్షం కారణంగా రోడ్లు జలమయం కావడంతో బైక్ స్క్రిడ్ అయి అదుపుతప్పి, అటుగా వస్తున్న ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంచీకి చెందిన రాజకుమార్‌ వర్మ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన వినయ్‌ యాదవ్‌(జంషెడ్‌పూర్) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత మృత్యువాతపడ్డారు. వీరిరువురూ రెండేళ్లుగా వియత్నాంలో యోగా శిక్షకులుగా పనిచేస్తూ.. వాళ్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. కాగా.. ప్రమాదంలో ఇద్దరి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడం వారి కుటుంబాలకు ఆర్థికపరంగా పెద్ద సమస్యగా మారినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంజయ్‌ ప్రసాద్‌ యాదవ్‌ తెలిపారు. మృతదేహాలను త్వరలోనే జార్ఖండ్‌కు తీసుకువచ్చే ఏర్పాట్లు చేపట్టినట్టు ఆయన చెప్పారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఒకేసారి ఆర్థిక సాయమందించే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి:

ముంబైలో అనుకూలించని వాతావరణం.. 12 విమానాల దారి మళ్లింపు

ఓటర్లకు ఊరట.. ఫారం-6పై ఈసీ కీలక నిర్ణయం

Updated Date - Sep 30 , 2026 | 02:50 PM