Share News

ముంబైలో అనుకూలించని వాతావరణం.. 12 విమానాల దారి మళ్లింపు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:54 AM

ముంబైలో వాతావరణం అనుకూలించని కారణంగా పలు విమానాలను గుజ్‌రాత్ వైపు దారి మళ్లించాల్సి వచ్చింది. ముంబైలో దిగాల్సిన 12 విమానాలను సూరత్, వడోదర ఎయిర్‌పోర్టుల వైపు పంపించారు.

ముంబైలో అనుకూలించని వాతావరణం.. 12 విమానాల దారి మళ్లింపు
Mumbai Airport Diversion

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో వాతావరణం అనుకూలించని కారణంగా పలు విమానాలను మంగళవారం సాయంత్రం గుజ్‌రాత్ వైపు దారి మళ్లించాల్సి వచ్చింది. ముంబైలో దిగాల్సిన 12 విమానాలను సూరత్, వడోదర ఎయిర్‌పోర్టులకు పంపించారు. వీటిల్లో 8 సూరత్‌లో, నాలుగు వడోదరలో ల్యాండయ్యాయి. బుధవారం తెల్లవారేసరికి విమానాలన్నీ ముంబైకి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానాలను దారి మళ్లించిందని సంబంధిత అధికారులు తెలిపారు. గుజరాత్‌కు వచ్చిన ప్రయాణికులకు మంచి నీరు, రీఫ్రెష్‌మెంట్స్ వంటి వాటిని సిబ్బంది అందించారు.


సూరత్‌కు వెళ్లిన విమానాల్లో ఐదు ఇండిగోకు చెందినవి కాగా, మూడు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు ఉన్నాయి. వడోదరలో దిగిన విమానాల్లో మూడు ఎయిర్ ఇండియా విమానాలు ఉన్నాయి. ఇండిగోకు చెందిన మరో విమానం కూడా వడోదరలో దిగింది. ఆకాశం మేఘావృతం కావడంతో పాటు తీవ్ర గాలులు, మెరుపులు, ఉరుములతో మంగళవాకం సాయంత్రం ముంబైలో వాతావరణం అనుకూలంగా లేదని వడోదర ఎయిర్‌పోర్టు అధికారి తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత దళాలకు చిక్కిన పాకిస్థానీలు.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ సీజ్

రేవంత్‌ వ్యాఖ్యలు హిందూ విశ్వాసాలపై దాడే

Updated Date - Sep 30 , 2026 | 12:10 PM