ఓటర్లకు ఊరట.. ఫారం-6పై ఈసీ కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:39 PM
కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫారం-6 ఆన్‌లైన్ దరఖాస్తుల నుంచి 'SIR డిక్లరేషన్'ను ఉపసంహరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. సర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో ఫారం-6 ఆన్‌లైన్ దరఖాస్తుల నుంచి 'SIR డిక్లరేషన్'ను ఉపసంహరించుకుంది. ఇప్పటికే సర్ ప్రక్రియ పూర్తైన రాష్ట్రాల్లో ఓటర్లుగా తమ పేరును కొత్తగా నమోదు చేసుకోదలిచిన వారు సాధారణ ఫార్మ్-6ను సమర్పించాలని ఈసీ పేర్కొంది. మునునటి ఎస్ ప్రక్రియలోని తల్లిదండ్రులు, తాతల వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో, తల్లిదండ్రుల పాత డేటాతో సంబంధం లేకుండా ఇకపై కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం యువతకు లభించింది.
SIR ప్రక్రియ కొసనాగుతున్న ప్రాంతాల్లో మాత్రం కొత్తగా పేర్ల నమోదు కోసం యువ ఓటర్లు తమ తల్లిదండ్రులకు సంబంధించి మునుపటి సర్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అదనపు డిక్లరేషన్‌గా మాత్రమే యువ ఓటర్లు ఈ వివరాలను ఇవ్వాల్సి ఉంటుందని ఈసీ స్పష్టత ఇచ్చింది. సర్ ప్రక్రియలో ఓటుకు దూరమైన వారు కూడా ఇదే అదనపు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఫారం-6 లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించింది.
అసలేమిటీ వివాదం
ఫారం-6లో మార్పుల విషయంలో ఎన్నికల కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఫారం-6 ద్వారా కొత్తగా ఓటర్లుగా నమోదు కాదలిచిన వారు మునుపటి సర్ ప్రక్రియలోని తమ తల్లిదండ్రుల వివరాలను కూడా జత చేయాలని ఈసీ కోరడంపై ఎన్నికల కమిషనర్లు సంధూ, జోషి అభ్యంతరాలు చెప్పినట్టు తెలిసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960కి మార్పులు చేయకుండా ఫారం-6లోమార్పులు సాధ్యం కాదని ఈసీలు పేర్కొన్నట్టు సమాచారం.
అయితే, ఫారం-6లో కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదని ఈసీ ఆ తరువాత ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అదనపు డిక్లరేషన్‌గా మాత్రమే సర్ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పినట్టు పేర్కొంది. ఏకాభిప్రాయంతోనే ఈ నిబంధన రూపొందించినట్టు తెలిపింది. సర్ ప్రక్రియ ముగిసిన ప్రాంతాల్లో అదనపు డిక్లరేషన్ కూడా అవసరం లేదని తాజాగా తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
కాంగ్రెస్‌పై అసంతృప్తి.. INDIA కూటమి మీటింగ్‌కు అఖిలేశ్ డుమ్మా!
ముంబైలో అనుకూలించని వాతావరణం.. 12 విమానాల దారి మళ్లింపు