సమాజ్వాదీ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు కీలక నేతలు!
ABN , Publish Date - Oct 14 , 2026 | 03:38 PM
త్వరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సమాజ్ వాదీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలో చేరారు.
సమాజ్ వాదీ పార్టీకి చెందిన అభయ్ సింగ్, రాకేశ్ ప్రతాప్ సింగ్, వినోద్ చతుర్వేది ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ, యూపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి సమక్షంలో వారు కాషాయం పార్చేటీలో చేరారు. ఈ సందర్భంగా తాను సమాజ్వాదీ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో అభయ్ సింగ్ వివరించారు. సనాతన ధర్మానికి వ్యతిరేక పద్ధతులు అవలంభిస్తూ, పార్టీ పదవుల నియామకాల్లో వివక్ష చూపిస్తున్నారని ఎస్పీపై ఆయన ఆరోపణలను చేశారు. సమాజ్ వాదీ పార్టీ రామచరితమానస్ ను చించివేయడం వంటి చర్యలకు పాల్పడిందని అభయ్ సింగ్ ఆరోపించారు. భజనపరులకు మాత్రమే పార్టీలో పదవులు, ఉద్యోగాలు ఇచ్చేవారంటూ ఎస్పీపై అభయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజ్యసభ పదవుల విషయంలో ఎస్పీతో పోలిస్తే బీజేపీ అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇచ్చిందని అభయ్ సింగ్ తెలిపారు. ఎస్పీ మాత్రం సొంత వ్యక్తులకు మాత్రమే పదవులను కట్టబెట్టేదంటూ మండిపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఉద్యమం విదేశీయ నిధుల కోసమే నడుస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఉద్యోగ కుంభకోణాల గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ స్కాంలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేస్తున్నామని చెప్పారు. చివరగా 'జై శ్రీరామ్' అనే నినాదంతో అభయ్ సింగ్ తన ప్రసంగాన్ని ముగించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక నేతలు పార్టీని వీడటం సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్
ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
బుమ్రాపైనే ఇంకెన్నాళ్లు ఆధారపడుతారు?: క్రిస్ శ్రీకాంత్