Share News

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

ABN , Publish Date - Oct 13 , 2026 | 04:14 PM

భారత క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల క్రితమే ఈ జంట తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి
Prithvi Shaw, Akriti Agarwal

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ మళ్లీ ఒక్కటయ్యారు. కొన్ని వారాల క్రితమే ఈ జంట తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఇతరుల అభిప్రాయాలకు ప్రభావితమై తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని అంగీకరించింది. ఆకృతి చేసిన పోస్టును పృథ్వీ షా కూడా తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నాడు.


‘నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నప్పుడు.. మా బంధం గురించి మా కంటే ఎక్కువ తెలిసినట్లుగా భావించిన నా సన్నిహితుల అభిప్రాయాలకు ప్రభావితమయ్యాను. సరైన రీతిలో మాట్లాడుకుని, ఒకరినొకరం అర్థం చేసుకునే అవకాశం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయంలో నేను తప్పుదారి పట్టానని ఇప్పుడు భావిస్తున్నాను. నా నిర్ణయం వల్ల పృథ్వీ పడ్డ బాధకు నేనే బాధ్యత వహిస్తున్నా. ఆ తర్వాత ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం ఒకరికొకరం సరిపోతాం. మా బంధానికి మరెవరి అవసరం లేదు. కొత్తగా మా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరుతున్నాం’ అని ఆకృతి తన పోస్టులో పేర్కొంది.


పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తమ భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయని పేర్కొంటూ సెప్టెంబర్‌లో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆకృతి వెల్లడించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

లింక్డిన్‌లోకి కోహ్లీ ఎంట్రీ.. తొలి పోస్ట్ దేని గురించో తెలుసా?

అరుదైన ఘనత.. ఐదోసారి ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా గిల్

Updated Date - Oct 13 , 2026 | 04:14 PM