Share News

ఢిల్లీ ఓటర్ల సర్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయం..

ABN , Publish Date - Oct 14 , 2026 | 01:45 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును అక్టోబర్ 28న ఇతర సర్ పిటిషన్లతో కలిపి విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.

ఢిల్లీ ఓటర్ల సర్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయం..
Supreme Court

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణ కోసం ఫారం-6 నిబంధనను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నట్లు తొలగించిన ఓటర్లు ప్రకటించాలన్న ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనపై విచారణ సందర్భంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.


ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారితో తొలిసారి ఓటర్లమని ప్రకటించేలా చేయడం సమస్యలకు దారితీస్తుందని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు అక్టోబర్ 30తో ముగుస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే క్రిమినల్ చర్యలు, జైలు శిక్ష ఎదురయ్యే ప్రమాదం ఉందనీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ఓటర్ల పేర్ల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని పిటిషనర్ల తరఫున ప్రశాంత్ భూషణ్ విజ్ఞప్తి చేశారు.


ఈ సందర్భంగా ఆందోళనలను పరిష్కరించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ హామీ ఇచ్చారు. తదుపరి విచారణ రోజున ఈ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని న్యాయవాదికి సూచించారు. అనంతరం, ఈ కేసును అక్టోబర్ 28న ఇతర సర్ పిటిషన్లతో కలిపి విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య: ఎంపీ రాహుల్ గాంధీ

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్

Updated Date - Oct 14 , 2026 | 01:49 PM