Share News

ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి

ABN , Publish Date - May 18 , 2026 | 04:07 PM

కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు.

 ఏనుగుల బీభత్సం.. మహిళ మృతి
Elephant Camp incident

ఇంటర్నెట్ డెస్క్, మే 18 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో (Dubare Elephant Camp) విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కొడగు జిల్లాలోని ప్రసిద్ధ దుబారే ఏనుగుల శిబిరంలో జరిగింది. ఈ శిబిరంలో ఉన్న ఏనుగులను స్నానం చేయించేందుకు మావటీలు కొలనులోకి వదిలారు. ఈ సమయంలో నీటిలో ఉన్న రెండు ఏనుగులు అకస్మాత్తుగా గొడవకు దిగాయి. ఒక ఏనుగు మరో ఏనుగుపై దాడి చేయడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.


ఏనుగుల మధ్య జరిగిన ఈ గొడవలో ఓ ఏనుగు అదుపుతప్పి సమీపంలో ఉన్న పర్యాటకుల వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన మహిళ పర్యాటకురాలిపై ఏనుగు పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో శిబిరంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటన సమయంలో అక్కడ ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఏనుగులను స్నానం చేయించే సమయంలో సరైన భద్రతా చర్యలు చేపట్టారా..? అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దుబారే ఏనుగుల శిబిరం కర్ణాటకలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి ప్రతిరోజూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఘటన నేపథ్యంలో పర్యాటకుల భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి.. కిషన్‌రెడ్డి ధ్వజం

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 05:00 PM