తుంగభద్రకు పోటెత్తిన వరద
ABN , Publish Date - Aug 08 , 2026 | 01:34 PM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది.
47వేల క్యూసెక్కులు దాటిన ఇన్‌ఫ్లో
68 టీఎంసీలకు నీటి నిల్వ
బళ్లారి(బెంగళూరు): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. గత ఏడాదితో పోలిస్తే జలాశయానికి వస్తున్న ప్రవాహం దాదాపు రెట్టింపు కావడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఎగువున ఉన్న తుంగడ్యామ్ నుంచి సుమారు 26,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. టీబీ బోర్డు అధికారులు తెలిపిన వివరాల మేరకు గత 24 గంటల వ్యవదిలో డ్యామ్‌లోకి సగటున 47,559 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 1622.55 అడుగులకు చేరుకుంది.
గత ఏడాది ఆగస్టు 7 నాటకి జలాశయంలోకి కేవలం 2,54,033 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. వరద ఉధృతి పెరిగినప్పటికీ మొత్తం నీటి నిల్వ పరంగా చూస్తే గత ఏడాదితో పోలిస్తే ఇంకా వెనకంజలోనే ఉన్నా డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 68.776 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజు 80.003 టీఎంసీల నీరు ఉండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News