సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం.. విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మృతి..
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:34 PM
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద భద్రత కల్పిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద భద్రత కల్పిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యం కారణంగా డ్యూటీలో ఉండగానే ఆయన చనిపోయారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కారణంగా సల్మాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పిస్తోంది. 2024లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ముంబై, బాంద్రాలోని సల్మాన్ ఇళ్లు గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వద్ద కాల్పులు జరిపారు.
ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద కూడా భద్రత ఏర్పాటైంది. సల్మాన్ ఇంటి వద్ద డ్యూటీలో ఉన్న 41 ఏళ్ల గణేష్ అనే కానిస్టేబుల్ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గేటు ముందు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి పోలీసులు ఆయనను హుటాహుటిన దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. గణేష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్ గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఇవి కూడా చదవండి
ఇప్పట్లో మైదానంలోకి దిగడం కష్టమే.. బుమ్రా, హార్దిక్ గాయాలపై అప్‌డేట్!
హైడ్రాలో ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగుల అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే: హరీశ్ రావు