Share News

ట్రాఫిక్ సమస్యలకు చెక్.. సింగల్ సీటర్ ఫ్లయింగ్ వెహికల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:44 PM

ఉత్తరాఖండ్‌ అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా అనే యువకుడు హపిదా స్కైనెక్స్ అనే సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను తయారు చేశాడు. తాజాగా అల్మోరాలోని మైదానంలో అతడు దీనిని విజయవంతంగా పరీక్షించాడు.

ట్రాఫిక్ సమస్యలకు చెక్.. సింగల్ సీటర్ ఫ్లయింగ్ వెహికల్.. వీడియో వైరల్
Ravi Tamta

డెహ్రాడూన్, ఆగస్టు 08: దేశంలో ట్రాఫిక్ సమస్య నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. ఈ ట్రాఫిక్ భారీ నుంచి తప్పించుకునేందుకు దేశవ్యాప్తంగా పలు నూతన ఆవిష్కరణలు చేపడుతున్నారు. ఉత్తరాఖండ్‌ అల్మోరా జిల్లా కాఫ్లిఖాన్ గ్రామానికి చెందిన రవి తమ్తా అనే యువకుడు హపిదా స్కైనెక్స్ అనే సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్‌ను తయారు చేశాడు. తాజాగా అల్మోరాలోని మైదానంలో అతడు దీనిని విజయవంతంగా పరీక్షించాడు.


ఇది పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది. పూర్తిగా పర్యవరణహితంగా పని చేస్తుంది. సంవత్సరాల తరబడి అతడు చేసిన పరిశోధనకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుంది. భవిష్యత్తులో చేపట్టే ఆవిష్కరణలకు ఇది మార్గదర్శనంగా నిలుస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. హపిదా స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్‌ను స్థాపించిన రవి తమ్తా.. దీనిని అభివృద్ధి చేశాడు.


దేశంలోని యువతకే ఆదర్శం: సీఎం పుష్కర్ సింగ్

రవి తమ్తాను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అభినందించారు. మన యువతలోని ప్రతిభ, ఆవిష్కరణలకు కొదవ లేదని ఇది నిరూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. మీ ప్రయత్నం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యువతికే కాకుండా దేశంలో యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో మీ ఆవిష్కరణల ద్వారా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన శిఖరాలను అధిరోహిస్తారని తాను ఆశిస్తునానని రవి తమ్తాపై ప్రశంసలు కురిపించారు.

మీ ఉజ్వల భవిష్యత్తుకు, నిరంతర విజయానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉత్తరాఖండ్ సీఎం స్పందించారు. ఈ సందర్భంగా సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ వీడియోను పోస్ట్ చేశారు.


ఇవీ చదవండి:

తొలిసారి ఆర్టీసీ బస్సు గ్రామానికి వస్తే.. ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..?

కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా

For More Viral News And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 01:36 PM