Share News

సుప్రీంకోర్టులో మమతకు చుక్కెదురు.. బ్యాంక్ ఖాతాల పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - Oct 01 , 2026 | 06:10 PM

ఫ్రీజ్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను తిరిగి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ ఖాతాల్లో రూ.804 కోట్ల నిధులున్నాయి.

సుప్రీంకోర్టులో మమతకు చుక్కెదురు.. బ్యాంక్ ఖాతాల పిటిషన్ కొట్టివేత
Mamata Banerjee

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోని మమతా బెనర్జీ వర్గానికి ఈరోజు (గురువారం) సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఫ్రీజ్ చేసిన ఆ పార్టీ బ్యాంక్ ఖాతాలను తిరిగి నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ఎమ్ సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం పేర్కొంది.


తృణమూల్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో.. ఏ వర్గానికి ఆ పార్టీ బ్యాంక్ ఖాతాలోని నిధులపై హక్కులు ఉన్నాయనేదానిపై స్పష్టత రావడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. పార్టీ గుర్తుపై ఇంకా ఎన్నికల కమిషన్ వద్ద వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ఖాతాలు ఏ వర్గానికి చెందుతాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని చెప్పింది. అలాగే ఈ పిటిషన్‌పై విచారణ వేగవంతం చేయాలని కోల్‌కతా హైకోర్టును ఆదేశించింది,


కాగా అవినీతి ఆరోపణలతో పశ్చిమ బెంగాల్ పోలీసులు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతాల్లో రూ.804 కోట్ల నిధులున్నాయి. దీంతో తమ ఖాతాలకు ఫ్రీజ్ నుంచి విముక్తి కల్పించాలని మమత వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆగస్టు 27న ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఖాతాలను తిరిగి వినియోగించుకోనేందుకు నిరాకరించింది.


ఈ వార్తలూ చదవండి

ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’పై అప్పీల్ కొట్టివేత

ఓట్ల చోరీ’పై దేశవ్యాప్త ఉద్యమం

Updated Date - Oct 01 , 2026 | 06:17 PM