Share News

కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: టీజీ భరత్

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:29 AM

కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బిర్లా గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్హులకు కొత్త పింఛన్లు పంపిణీ చేశారు.

కర్నూలును పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: టీజీ భరత్
tg bharath in karnool

కర్నూలు, అక్టోబర్ 1: ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని బిర్లా గడ్డ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ.. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ.. సీఎం చంద్రబాబు నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఫ్రీ బస్సు, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి భరత్ అన్నారు. కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని.. ఈ దిశగా ఇప్పటికే జిల్లాలో ఎఫ్‌టీవో ఏర్పాటు చేశామని, కర్నూలుకు రూ. 50 వేల కోట్లను కేబినెట్ మంజూరు చేసిందని, డ్రోన్ రంగాలకు కేంద్రంగా కర్నూలును అభివృద్ధి చేస్తున్నామని మంత్రి భరత్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నాయకుడి నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి అన్నారు.


ఇవి కూడా చదవండి...

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:50 AM