Share News

బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులకు గాయాలు

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:52 AM

ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీకొట్టి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలవగా.. ఓ వ్యక్తి మృతిచెందారు.

బైక్‌ను ఢీకొట్టి కాలువలో బోల్తా పడిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులకు గాయాలు
Eluru accident

ఏలూరు, అక్టోబర్ 1: జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌ను ఢీకొట్టి స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలవగా.. ఓ వ్యక్తి మృతిచెందారు. ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న స్కూల్‌ బస్సు.. ఆటోను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆపై పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. స్కూల్ బస్సు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.


బస్సు బోల్తా పడిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిన్నారులకు కూడా గాయాలవడంతో వారిని హుటాహుటిన నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బస్సు ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


స్కూల్ బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా వాహనదారులు చెబుతున్నారు. బస్సులోని విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వీరందరికీ ప్రాథమిక చికిత్స అందించి మధ్యాహ్నం వరకు పర్యవేక్షణలో ఉంచి ఇళ్లకు పంపిస్తామని వైద్యులు తెలిపారు. అయితే ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి చనిపోవడం విషాదాన్ని నింపింది.


ఇవి కూడా చదవండి...

నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ

అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 11:14 AM