Share News

24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:28 PM

మన్నార్‌ గల్ఫ్‌ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది.

24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు

చెన్నై: మన్నార్‌ గల్ఫ్‌ నుంచి దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పరిసరాల్లో కేరళ ఆనుకొని ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 వరకు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో... రాష్ట్రంలో తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది.


nani1.2.jpgఈ నెల 24వ తేది వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్‌(Tamil Nadu, Puducherry, Karaikal) ప్రాంతాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీవర్షం కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పెళ్లాడింది జీవిత భాగస్వామిని.. పనిమనిషిని కాదు...

అమలులోకి నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 21 , 2026 | 12:28 PM