Share News

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ బృందానికి చిక్కిన డ్రగ్ పెడ్లర్..

ABN , Publish Date - Mar 21 , 2026 | 11:40 AM

తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్ పెడ్లర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది.

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. సిట్ బృందానికి చిక్కిన డ్రగ్ పెడ్లర్..
Moinabad Farmhouse Case

రంగారెడ్డి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో మొయినాబాద్ డ్రగ్స్ కేసు(Moinabad Farmhouse Case) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్ దర్యాప్తు చేపట్టిన ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్ పెడ్లర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ బృందం (SIT TEAM) అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ రవి ఇచ్చిన సమాచారంతో నాలుగు బృందాలుగా ఏర్పడిన సిట్ ఎట్టకేలకు అతణ్ని పట్టుకుంది. హైదరాబాద్‌లోనే అభిషేక్ సింగ్‌ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.


బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ పార్టీకి అభిషేక్ సింగ్(Abhishek Singh) డ్రగ్స్ సప్లై చేశాడు. హైదరాబాద్ ORR వద్ద అభిషేక్ సింగ్ నుంచి రోహిత్ డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేశాడు. అనంతరం పార్టీలో నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్‌రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి డ్రగ్స్ వినియోగించారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడగా.. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డి మద్యంలో కొకైన్ కలుపుకుని తాగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.


తాజాగా, అభిషేక్ సింగ్ పోలీసులకు చిక్కడంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ సింగ్ నుంచి ఇంకా ఎవరెవరూ డ్రగ్స్ కొనుగోలు చేశారు? అనే విషయంపైనా కూపీ లాగుతున్నారు సిట్ అధికారులు. మరోవైపు అతని ఫోన్‌లో కీలక డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అభిషేక్ సింగ్ సెల్ ఫోన్ డేటాను విశ్లిస్తున్నారు సిట్ అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి

రంజాన్ పండగ వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

గ్యాస్‌ కోసం జనం బారులు

Updated Date - Mar 21 , 2026 | 12:09 PM