Share News

ఆయన జీవితం నిరాడంబరం..

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:34 PM

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్‌ కోర్టులో మేజిస్ట్రేట్‌గా సేవలందిస్తున్న పీకే శివకుమార్‌ రోజూ సైకిల్‌పైనే కోర్టుకు వెళ్తూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

ఆయన జీవితం నిరాడంబరం..
Tamil Nadu Judge, Cycle, Court

  • అత్యున్నత పదవిలో ఉన్నా సైకిల్‌పైనే విధులకు

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్‌ కోర్టులో మేజిస్ట్రేట్‌గా సేవలందిస్తున్న పీకే శివకుమార్‌ రోజూ సైకిల్‌పైనే కోర్టుకు వెళ్తూ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. శివకుమార్‌ జన్మస్థలం నామక్కల్‌. ఆయన సేలం, కోయంబత్తూరు మేట్టుపాళయం, పుదుకోట ఇతర మేజిస్ట్రేట్‌, సబార్డినేట్‌ కోర్టుల్లో పనిచేశారు. నిరాడంబరంగా, నిజాయితీకే ఉండే పీకే శివకుమార్‌ దిగువ కోర్టులో మేజిస్ట్రేట్‌గా ఉన్నప్పుడు సైకిల్‌పైనే డ్యూటీకి వెళ్తుండేవారు.


కొద్ది నెలల క్రితం జిల్లా మేజిస్ట్రేట్‌గా పదోన్నతి పొంది కోవై జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలోనూ ఆయన ఇంటి నుంచి కోర్టుకు సైకిల్‌పైనే వెళుతున్నారు. ప్రస్తుతం కోర్టులోకి ఆయన నడిచివెళ్ళడవే అనవాయితీగా పెట్టుకున్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌ ఇలా వ్యవహరిస్తుండటం అందరికీ ఆశ్చర్యం వేసింది. అంతే కాకుండా ఇంటి నుంచి తెచ్చుకునే భోజనాన్ని తనతో పనిచేసే సిబ్బందితో కలిసి చేయడం మరీ విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి:

రైతులకు శుభవార్త.. రెండెకరాలకు ఒకేసారి యూరియా!

ములుగు కొండల్లో అపురూప రాతి చిత్రాలు!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 08 , 2026 | 12:35 PM