ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:37 AM
వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.
ప్రకాశం జిల్లా: ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘర్షణ సమయంలో మహిళా కార్యకర్తలతో కొందరు పురుష కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. ఓ మహిళ కార్యకర్తపై వైసీపీ నేత చేయి కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలో పురుషులు, మహిళలు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. మహిళలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం తోపులాట, వాగ్వాదానికి దిగగా, పురుష కార్యకర్తలు చొక్కాలు చించుకునే వరకు ఘర్షణ కొనసాగింది. వైఎస్సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Also Read:
ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ
కొరియా కంపెనీలకు లోకేశ్ ఆహ్వానం.. బుసాన్‌లో APEX-Korea ప్రారంభం