లష్కరే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు స్వాధీనం
ABN , Publish Date - Oct 12 , 2026 | 08:17 PM
జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇద్దరు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌కు సమీపంలోని దనిహామాలో ఆ ఇంటిని గుర్తించారు. ఆ ఇంట్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి సీజ్ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఇద్దరు లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌కు సమీపంలోని దనిహామాలో ఆ ఇంటిని గుర్తించారు. ఆ ఇంట్లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం అందడంతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేసి సీజ్ చేశారు. ఆ ఇంటి ఓనర్‌ను గులాం మొహమ్మద్ మిర్ అలియాస్ మామా గాస్‌గా గుర్తించారు.
ఎన్ఐఏ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ లష్కర్-ఎ-తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అబూ హురైరా, ఖుబైబ్‌కు గులాం మొహమ్మద్ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అంతేకాకుండా ఉగ్రవాదులకు కావాల్సిన లాజిస్టికల్ సౌకర్యం కూడా కల్పించాడు. ఆ ఇంట్లో నుంచి ఉగ్రవాద సాహిత్యానికి సంబంధించిన మెటీరియల్‌ను, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఇంటిని స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కొంతమంది స్థానికులతో కూడిన ఒక నెట్‌వర్క్.. పాక్‌లోని హ్యాండ్లర్లతో కలిసి చొరబాట్లకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ నెట్‌వర్క్ సాయంతో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు శ్రీనగర్ జిల్లాలోకి చొరబడుతున్నట్లు పసిగట్టారు. ప్రస్తుతం అధికారులు అలాంటి నెట్‌వర్క్‌ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా వారికి ఆశ్రయం ఇచ్చి ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలాంటి వారి ఆస్తులను జప్తు చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం
మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు