Share News

‘సేవ్ ది వోట్ - సేవ్ ది కంట్రీ’ పేరిట ఢిల్లీలో మెగా ర్యాలీ: రాహుల్ గాంధీ

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:36 AM

‘సేవ్ ది వోట్ - సేవ్ ది కంట్రీ’ పేరుతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్ 1న ‘జన్ మార్చ్ అండ్ మెగా ర్యాలీ’ నిర్వహిస్తుట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

‘సేవ్ ది వోట్ - సేవ్ ది కంట్రీ’ పేరిట ఢిల్లీలో మెగా ర్యాలీ: రాహుల్ గాంధీ
mega rally in delhi on november 1

ఇంటర్నెట్ డెస్క్: ‘సేవ్ ది వోట్ - సేవ్ ది కంట్రీ’ పేరుతో ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నవంబర్ 1న ‘జన్ మార్చ్ అండ్ మెగా ర్యాలీ’ నిర్వహిస్తుట్లు లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


‘నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో ‘సేవ్ ది వోట్ - సేవ్ ది కంట్రీ’ పేరుతో నిర్వహిస్తున్న ర్యాలీలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలి. విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు అంటూ తేడా లేకుండా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడాలి. ఓటర్ల జాబితాల నుండి పేర్లను తొలగించారు. నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించారు. ప్రశ్నించిన వారిపై లాఠీలతో దాడి చేశారు. ఓటు మీది.. పోరాటం కూడా మీదే. రాబోయే 7 రోజుల పాటు ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి. తమ చర్యల ద్వారా కార్యక్రమానికి పరోక్షంగా మరింత ప్రచారం కల్పిస్తున్నందుకు బీజేపీకి కృతజ్ఞతలు’ అంటూ రాహుల్ పోస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 12:02 PM