Share News

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:07 PM

ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో కలిసి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న ఆయన.. సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు.

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష
Amit Shah Delhi Police Review

ఢిల్లీ, అక్టోబర్ 24: దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ (శనివారం) ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని (హెడ్‌క్వార్టర్స్) సందర్శించి సీనియర్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఎన్నికల సంఘంపై నిరసనలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 1 రామ్‌లీలా మైదాన్ మెగా ర్యాలీ: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ, 'ఇండియా' (INDIA) కూటమి భాగస్వామ్య పార్టీలు నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణపై ఈ భేటీలో అమిత్ షా, సీఎం రేఖా గుప్తా పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. (Amit Shah Delhi Police Review)


ఈ వార్తలూ చదవండి

అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..

గ్రీకు రెస్టారెంట్‌లో తొలి పరిచయం.. రాజీవ్‌ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..

Updated Date - Oct 24 , 2026 | 06:07 PM