Share News

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:23 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలుకీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు.

గోబర్ధన్‌ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Central Cabinet Meeting

ఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన ఈరోజు (గురువారం) కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌లో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బయోగ్యాస్‌ ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించారు.


రూ.23,731 కోట్ల ‘గోబర్ధన్’ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 నుంచి 2035-36 వరకు కేంద్రం అమలు చేయనుంది. వ్యవసాయ అవశేషాలు, పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తి చేయనుంది. దేశీయ CBG ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడమే లక్ష్యమని కేంద్ర మంత్రులు తెలిపారు. దిగుమతి సహజవాయువుపై ఆధారాన్ని తగ్గించి ఇంధన భద్రతకు బలం చేకూర్చనుందని వెల్లడించారు. రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, సహకార సంఘాలకు కొత్త ఆదాయ అవకాశాలు వస్తాయని మంత్రులు పేర్కొన్నారు. అస్సాంలో నాలుగు లేన్ల నేషనల్ హైవేకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రూ.8,970 కోట్లతో అస్సాంలో నేషనల్ హైవే నిర్మించాలని మంత్రులు ఆమోదించారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 05:25 PM