Share News

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ

ABN , Publish Date - May 21 , 2026 | 06:05 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు(గురువారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ప్రారంభమైంది. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తున్నారు.

పశ్చిమాసియా సంక్షోభ ప్రభావాలపై కేంద్ర కేబినెట్ కీలక చర్చ
Union Cabinet Meeting

ఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) అధ్యక్షతన ఈరోజు (గురువారం) సాయంత్రం 5 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం (Union Cabinet Meeting) ప్రారంభమైంది. అయితే, 11 నెలల తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశమైంది. జూన్ 9వ తేదీకి మోదీ ప్రభుత్వం రెండేళ్ల పూర్తి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దేశంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు చేరుతున్న సేవలు, వివిధ పథకాల అమలు స్థితి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల ప్రభావంపై మంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిపై కూడా సమీక్షించనున్నారు.


రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు వంటి కీలక ప్రాజెక్టుల అమలు వేగం, పెట్టుబడుల పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రివర్గంతో ప్రధాని చర్చించనున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీస్తున్న పశ్చిమాసియా సంక్షోభంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం, చమురు ధరల మార్పులు, వాణిజ్యంపై పడే ప్రభావం వంటి అంశాలను ప్రధాని మోదీ సమీక్షిస్తున్నారు. వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, తీసుకున్న నిర్ణయాలు, రాబోయే రోజుల కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పురోగతి నివేదికలను ప్రధాని ముందు ఉంచినట్లు సమాచారం. ఈ సమావేశంలో భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఆర్థిక వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మరింత సమర్థవంతమైన అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి...

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 06:15 PM