యుద్ధం కాదు.. చర్చలే పరిష్కారం: ప్రధాని మోదీ
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:06 PM
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్ పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సమస్యకైనా సైనిక యుద్ధం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. ఇరాన్ పరిస్థితులు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలకు పరిష్కారం యుద్ధరంగంలో కాదని.. చర్చలు- దౌత్యంలోనే ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ ప్రకటన విడుదల చేశారు.
దౌత్య మార్గాన్ని అనుసరించాలి..
ప్రపంచ దేశాలు సంభాషణ, దౌత్య మార్గాన్ని అనుసరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతియుత పరిష్కారం అవసరమని వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పటినుంచో శాంతి, సంభాషణ, దౌత్యానికి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో యుద్ధాల వల్ల మానవ నష్టం పెరుగుతుందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ క్షిపణి పరీక్ష
కువైట్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్‌లో భారీ పేలుడు.. చమురు లీక్‌పై ఆందోళన
Read Latest International News And Telangana News And AP News And Telugu News