76 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా, ఆరోగ్యంగా మోదీ.. ప్రధాని డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
ABN , Publish Date - Sep 17 , 2026 | 01:54 PM
76 ఏళ్ల వయసులోనూ ప్రధాని మోదీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారు. ఇందుకోసం ఆయన ఫాలో అవుతున్న డైట్ ప్లాన్ ఏంటో తెలుసా?
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రధాన మంత్రి మోదీ ఇవాళే(గురువారం) తన 76వ పుట్టినరోజును నిర్వహించుంటున్నారు. అయితే 76 ఏళ్ల వయసులోనూ ఆయన ఎలా అంత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నారని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. యోగా, వ్యాయామాలను నిత్యం చేయడం వల్ల అంత ఫిట్‌గా ఉంటారనే విషయం చాలామందికి తెలుసు. వీటితో పాటు మోదీ డైటింగ్ ప్లాన్ కూడా ఆయనను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతోంది. ఈ సందర్భంగా ప్రధాని ఆహారపు అలవాట్లు గురించి తెలుసుకుందాం.!
తరచూ మొరింగా పరోటా
మోదీకి మొరింగా పరోటా(మునగాకు పరోటా) అంటే చాలా ఇష్టమట. 2020లో జరిగిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఆయనే స్వయంగా ఈ విషయాలను వెల్లడించారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఆయన మొరింగా పరోటాను తీసుకుంటుంటారు. మునగాకులో పీచుపదార్థాలు, విటమిన్ల లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
భారతీయ వంటకాలను మాత్రమే ఇష్టపడే మోదీ.. రోటి, పప్పు, రైస్, పోహ, ఉప్మ లాంటివి తీసుకుంటానని ఫిట్ ఇండియా కార్యక్రమంలో చెప్పారు. ఎప్పుడూ తాజాగా వండిన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతానని వివరించారు.
ఉపవాసానికి ప్రాధాన్యం
ఉపవాసానికి కూడా ప్రాధాన్యమిస్తారు మోదీ. చాతుర్మాసంలో ఆయన రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారని తెలుస్తోంది. అలాగే దేవీ నవరాత్రులలోనూ పూర్తిగా పస్తులుంటారని సమాచారం. ఆ తొమ్మిది రోజులు కేవలం గోరువెచ్చటి నీటినే తీసుకుంటారు. ఇక చైత్ర నవరాత్రుల్లోనూ రోజుకు ఒక పండు చొప్పున మాత్రమే తీసుకుంటారు. ఎక్కువగా బొప్పాయి పండును తినే ప్రధాని.. ఏటా సుమారు 50 నుంచి 55 రోజులు ఉపవాసం చేస్తారు.
తాను ఎక్కువగా వేడి నీటినే తాగుతానని మోదీయే వెల్లడించారు. మొత్తానికి ఇలా ప్రధాని డైటింగ్ ప్లాన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఆయనకు స్వదేశి వంటకాలంటే ఎనలేని అభిమానమట.
ఇవీ చదవండి
ప్రధాని మోదీ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ వివరాలు..
మోదీ.. మోస్ట్ ఫాలోవ్డ్!.. సోషల్ మీడియాలో 'జన్ జెడ్' జోరు