Share News

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం.. అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్

ABN , Publish Date - Sep 17 , 2026 | 10:32 AM

అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

మా ప్రయోజనాలను కాపాడుకుంటాం.. అమెరికా ఆంక్షల బిల్లుపై భారత్
India US Russia sanctions bill

ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే కీలక బిల్లును అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన నేపథ్యంలో భారత్ స్పందించింది. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని న్యూఢిల్లీ నిశితంగా పరిశీలిస్తోందని, అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యా నుంచి భారీగా చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం సుంకాలు విధించే అధికారం ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది (India US Russia sanctions bill).


రష్యా నుంచి భారీగా భారత్, చైనా చమురు కొనుగోలు చేస్తున్నాయి. దీంతో భారత్‌పై కూడా భారీగా సుంకాలు విధించే అవకాశం ఉంది. తాజాగా ఈ బిల్లుపై భారత ప్రభుత్వం స్పందించింది. దేశ జాతీయ ప్రాధాన్యతలు, 140 కోట్ల మందికి అవసరమైన ఇంధన భద్రత ఆధారంగానే తాము నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అమెరికాతో ఈ అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు కొనసాగుతున్నాయని కూడా తెలిపింది (US tariffs on India).


అమెరికా ప్రతినిధుల సభ ఈ బిల్లును 262–159 ఓట్లతో ఆమోదించింది (100 percent tariff India). ఇప్పుడు బిల్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కోసం వెళ్లింది. ఈ బిల్లుపై తాను సంతకం చేస్తానని ట్రంప్ గతంలోనే ప్రకటించారు. ట్రంప్ సంతకం చేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం చట్టంలోని నిబంధనలను ఎలా అమలు చేస్తుందనేది అత్యంత కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి..

రష్యాపై భారీ ఆంక్షల బిల్లుకు అమోదం.. భారత్, చైనాపై 100 శాతం సుంకాలకు ఛాన్స్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 17 , 2026 | 10:32 AM