Share News

విజయవంతంగా ‘ఆపరేషన్ ట్రైడెంట్‌’.. రూ.100 కోట్ల హవాలా గుట్టు రట్టు

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:55 AM

డ్రగ్స్ రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 3 రాష్ట్రాల్లో దాడులు చేసి సుమారు రూ.100 కోట్ల హవాలా గుట్టును రట్టు చేసి.. 18 మంది అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేసింది.

విజయవంతంగా ‘ఆపరేషన్ ట్రైడెంట్‌’.. రూ.100 కోట్ల హవాలా గుట్టు రట్టు
operation trident in 3 states

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై కేంద్రం పంజా విసిరింది. దాదాపు 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆపరేషన్లు నిర్వహించి 18 మంది అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా సభ్యులను అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..


2029 డిసెంబర్ 31 నాటికి దేశాన్ని ‘డ్రగ్స్ రహిత భారత్’ గా రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ విజయవంతంగా ముందుకు సాగుతోంది. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్‌ను పూర్తిగా తుడిచివేయడానికి ప్రభుత్వం ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా మణిపూర్, అసోం, మిజోరం 3 రాష్ట్రాల్లోని 38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. విజయవంతంగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో పోలీసులు అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. రూ.100 కోట్ల హవాలా గుట్టును రట్టు చేసి 1,424 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. 18 మంది అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 500 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి ..

పాక్ వల్లే కశ్మీరీలకు రక్షణ.. ఫరూక్ అబ్దుల్లా

ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అమిత్ షా, సీఎం రేఖా గుప్తా.. శాంతిభద్రతలపై సమీక్ష

Updated Date - Oct 25 , 2026 | 10:59 AM