విరుల సోయగం.. రెండో సీజన్‌కు ఊటీ సిద్ధం
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:40 PM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. అక్కడి బొటానికల్ గార్డెన్‌లో పూలకుండీల్లో పెంచుతున్న మొక్కలన్నీ వికసిస్తున్నాయి.
చెన్నై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం ఊటీ రెండో సీజన్‌కు సిద్ధమవుతోంది. అక్కడి బొటానికల్ గార్డెన్‌లో పూలకుండీల్లో పెంచుతున్న మొక్కలన్నీ వికసిస్తున్నాయి. ముఖ్యంగా పర్యాటకులను బాగా ఆకట్టుకునే మేరీగోల్డ్ తదితర పుష్పాలు ప్రస్తుతం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నీలగిరి జిల్లాలోని ఊటీలో ప్రతియేటా ఏప్రిల్, మే నెలల్లో సమ్మర్ సీజన్ సందర్భంగా పర్యాటకులను ఆకర్షించేలా ఫ్లవర్‌షోలు, రోజ్ ఎగ్జిబిషన్, కున్నూరు సిమ్స్ పార్కులో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తారు.
ఇదే విధంగా సెకండ్ సీజన్ సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో ఉత్తరాది రాష్ట్రాలు, దేశవిదేశాల నుంచి వచ్చే వేలాదిమంది పర్యాటకుల కోసం రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఫ్లవర్‌షోలు నిర్వహిస్తారు. ఆ మేరకు ఊటీ బొటానికల్ గార్డెన్ అంతటా పూలకుండీల్లో మేరిగోల్డ్, డాలియా,డైసీ, కేలండుల్లా తదితర రకాల పూలమొక్కలను పెంచుతున్నారు.ఆ పార్క్ ప్రవేశద్వారంలోను, జపాన్ పార్కు వంటి ప్రదేశాల్లోనూ నాలుగు లక్షలకు పైగా పూలమొక్కలు పెరుగుతున్నాయి.
జపాన్ పార్కులో అలంకరణకు ఉపయోగించే వివిధ రంగుల పుష్పాలతో ‘ఐ లవ్ ఊటీ’ అని అక్షరాలతో పూలవలయాన్ని సిద్ధం చేశారు. 35వేలకుగా పైగా పూలకుండీల్లో మొక్కలను పెంచుతున్నారు. రెండో సీజన్ కోసం కుండీల్లో పెంచుతున్న మొక్కల్లో ప్రస్తుతం పుష్పాలు అందంగా వికసిస్తున్నాయి. దసరా సెలవులు దగ్గరపడుతుండటంతో నీలగిరి జిల్లాలో పర్యాటకుల సందడి విపరీతంగా పెరుగుతుందని ఉద్యానవన శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
12 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..
Read Latest AP News And Telangana News And International News And Telugu News