Share News

విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది.. అంతరాయాలు లేకుండా చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:10 PM

ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ విప‌రీతంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గతేడాది ఇదే రోజుల్లో కేవ‌లం 240 మిలియ‌న్ యూనిట్లుగా ఉందని.. ఇప్పుడు రోజువారి వినియోగం 290 మిలియ‌న్ యూనిట్లకు చేరిందని వెల్లడించారు.

విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది.. అంతరాయాలు లేకుండా చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్
Gottipati Ravi Kumar

అమరావతి, సెప్టెంబర్ 22: ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ విప‌రీతంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజుల్లో కేవ‌లం 240 మిలియ‌న్ యూనిట్లుగా ఉందని.. ఇప్పుడు రోజువారి వినియోగం 290 మిలియ‌న్ యూనిట్లకు చేరిందని వెల్లడించారు. అధిక ఎండ‌ల వ‌ల‌న‌ ఈ ఏడాది దాదాపు 20 శాతంపైగా విద్యుత్ వినియోగం పెరిగిందని వివరించారు. జెన్కో సంస్థ రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా పెరిగిన వినియోగంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా బ‌య‌ట నుంచి కొనుగోళ్లు చేసి విద్యుత్ అంత‌రాయాలు లేకుండా చూస్తున్నామని చెప్పారు.


గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలలో ప‌వ‌ర్ క‌ట్స్ లేకుండా చేయాలన్నదే కూట‌మి ప్రభుత్వ ల‌క్ష్యమని మంత్రి తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతి వారం విద్యుత్ శాఖ‌పై స‌మీక్ష చేసి దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో దేశ‌వ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుతో పాటు ప‌లు రాష్ట్రాల్లో విద్యుత్ స్కేర్ సిటీ ఉందని వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపుల‌తో వ‌ర్షాలు కురుస్తున్నా...పెద్దగా ప్రయోజనం ఉండటం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ అంత‌రాయాలు లేకుండా చూడ‌టానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

తిరుమల నడకమార్గంలో చెట్టుపై చిరుత.. భక్తుల పరుగో పరుగు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 12:11 PM