తిరుమల నడకమార్గంలో చెట్టుపై చిరుత.. భక్తుల పరుగో పరుగు
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:47 AM
తిరుమలలో మెట్లమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
తిరుమల, సెప్టెంబర్ 22: తిరుమలలో మెట్లమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. 2700 మెట్టు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుపై భక్తులకు చిరుత కనిపించింది. చెట్టుపై చిరుతను చూసిన భక్తులు.. తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. అనంతరం దగ్గరలోని భద్రతా సిబ్బందికి చిరుత సంచారంపై సమాచారం అందజేశారు. వెంటనే టీటీడీ విజిలెన్స్, అటవీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
వీరు వెళ్లే సమయానికి చిరుత చెట్టుపై నుంచి దిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నడక మార్గంలో చిరుత సంచారం నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తిరుమలకు నడక దారిని వెళ్లే భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని భక్తులకు భద్రతా సిబ్బంది సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్
రూ.240 కోట్ల నిధులపై సంబరాలు.. కూటమి నేతలకు దిష్టి తీసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
Read Latest AP News And Telugu News