ఊటీ రైలు మార్గం సిద్ధం
ABN , Publish Date - Oct 29 , 2026 | 01:21 PM
తమిళనాడు రాష్ట్రంలోని మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు మార్గం మరమ్మతు పనులు ముగిశాయి. ఈ నెల 23న కురిసిన కుండపోత వర్షానికి ఆ రైలు మార్గంలో మట్టిచరియలు, బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో కొండ రైలు సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే.
ముగిసిన మరమ్మతు పనులు
చెన్నై: మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు మార్గం మరమ్మతు పనులు ముగిశాయి. ఈ నెల 23న కురిసిన కుండపోత వర్షానికి ఆ రైలు మార్గంలో మట్టిచరియలు, బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో కొండ రైలు సేవలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ రైలు మార్గంలోని కురోవ్ - కున్నూరు రైల్వేస్టేషన్ల మధ్యనున్న పట్టాలపై అక్కడక్కడా మట్టిచరియలు, బండరాళ్లు దొర్లిపడ్డాయి. అదే విధంగా రైలు మార్గం పక్కనే ఉన్న కొన్ని చెట్లు కూడా కూలిపడ్డాయి.
దీంతో ఈ నెల 29 వరకు ఊటీ కొండ రైలు సేవలను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో కున్నూరు కొండ రైలు మార్గం విభాగం ఇంజనీర్ కుమార్ పర్యవేక్షణలో రైల్వే కార్మికులు రైలు మార్గం మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పుడు ట్రాక్ సిద్ధమవడంతో ఈ నెల 30 నుంచి రైలు సర్వీసులు పునరుద్ధరించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచలన నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్త రూల్స్
అమెజాన్‌లో 250 ఉద్యోగాలు ఫట్.. పొద్దున్నే ఉద్యోగులకు మెసేజ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News