Share News

నసీరుద్దీన్ ప్రమాదకర అర్బన్ నక్సల్: కిరణ్ రిజిజు

ABN , Publish Date - Oct 29 , 2026 | 10:14 AM

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన అర్బన్ నక్సల్ అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఆయన విధ్వంసకరమైన మేధావి అని వ్యాఖ్యానించారు.

నసీరుద్దీన్ ప్రమాదకర అర్బన్ నక్సల్: కిరణ్ రిజిజు

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నసీరుద్దీన్ షా ప్రమాదకరమైన అర్బన్ నక్సల్ అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా ఆయన విధ్వంసకరమైన మేధావి అని వ్యాఖ్యానించారు. దేశంలోని వివిధ యూనివర్సిటీ స్టూడెంట్లు చేస్తున్న నిరసన ప్రదర్శనలకు మద్దతు తెలుపుతూ నసీరుద్దీన్ అంతకుముందు చేసిన వీడియో నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు. సాధారణంగా నసీరుద్దీన్ మంచివారని తాను అనుకునేవాడని, ఇప్పుడిప్పుడే ఆయన నిజస్వరూపం బయటపడుతోందని ఆయన ట్వీట్ చేశారు. ‘షాను నేను గౌరవించేవాడిని, ఇష్టపడేవాడిని. కానీ, ఆయనలో ఒక ప్రమాదకరమైన, విధ్వంసకరమైన అర్బన్ నక్సల్ ఉన్నాడని నాకు తెలియదు. భారత ప్రజాస్వామ్యానికి ఆయన చాలా ప్రమాదకరం. ఆయన నిజ స్వరూపాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నా’ అని రిజిజు పేర్కొన్నారు.


కాగా.. స్టూడెంట్ యూనియన్లను పునురుద్ధరించాలని నిరసన తెలుపుతున్న ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులకు మద్దతుగా నసీరుద్దీన్ అంతకుముందు వీడియో చేశారు. ‘దిమాగీ నక్సల్’ అని బ్యాడ్జి ధరించి ఆ వీడియోలో ఆయన కనిపించారు. ‘నేను దిమాగీ నక్సల్ అని గర్వంగా చెప్పుకుంటాను. నా లాంటి వారికి యాంటీ నేషనల్, తుక్డే తుక్డే గ్యాంగ్ అని కాపలాదారులు ఏవేవో పేర్లు ఇచ్చారు. ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో తెలవదు’ అని షా పేర్కొన్నారు. దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోందని ఆయన విమర్శించారు. విద్య వ్యవస్థను నీరుగార్చిందని ధ్వజమెత్తారు. మొదట జవహర్‌లాల్ నెహ్రూ, తర్వాత సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్, ఇప్పుడు జామియా మిలియా.. విద్యార్థులకు చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను మర్చిపోమని షా వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Updated Date - Oct 29 , 2026 | 11:08 AM