భర్తపై 12 సార్లు కత్తితో దాడి.. భార్య, జిమ్ ట్రైనర్ అరెస్ట్!
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:47 AM
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భర్తపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. భార్యతో వివాహేతర బంధం ఉన్న జిమ్ ట్రైనర్, ఇంట్లో నిద్రిస్తున్న భర్త శశాంక్ పై రెండు కత్తులతో 12 సార్లు దాడికి పాల్పడినట్టు సమాచారం.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 29: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో భర్తపై హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. భార్యతో వివాహేతర సంబంధం ఉన్న జిమ్ ట్రైనర్ ప్రతాప్ సింగ్, ఇంట్లో నిద్రిస్తున్న శశాంక్ కంఠరియాపై రెండు కత్తులతో 12 సార్లు దాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటనలో భార్య ప్రియ పాత్రపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. తీవ్రంగా గాయపడిన శశాంక్ ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.(Ghaziabad Husband Murder Attempt)
కేసు వివరాల్లోకి వెళ్తే.. బాధిత భర్త శశాంక్ కంఠరియా (35) ఢిల్లీ ప్రభుత్వంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ప్రియ (32), ఆమె ప్రియుడు, జిమ్ ట్రైనర్ ప్రతాప్ సింగ్ (30) ఈ దాడికి కుట్ర పన్నినట్టు భావిస్తున్నారు. ప్రియ క్రమం తప్పకుండా వెళ్లే జిమ్‌లో జనవరిలో ప్రతాప్ సింగ్ ట్రైనర్‌గా చేరాడు. ఫిబ్రవరి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ చివరి నాటికి ఈ విషయం తెలుసుకున్న శశాంక్, భార్యను నిలదీసి ఆ సంబంధాన్ని తెంచుకోవాలని, జిమ్ మార్చాలని కోరాడు.
ఈ క్రమంలో శశాంక్ ఆ ప్రాంతం వదిలి ఢిల్లీకి మకాం మార్చాలని నిర్ణయించుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. పోలీసులు చెబుతోన్న సమాచారం ప్రకారం.. ఉదయం ప్రియ జిమ్‌కు వెళ్లే సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉంచింది. అదే అదనుగా లోపలికి ప్రవేశించిన ప్రతాప్ సింగ్, తన చిన్న కూతురి పక్కన నిద్రపోతున్న శశాంక్‌పై రెండు కత్తులతో 12 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. దాడి తర్వాత పారిపోతున్న నిందితుడిని స్థానికులు, సొసైటీ సెక్యూరిటీ గార్డులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని వద్ద నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
తీవ్ర గాయాలపాలైన శశాంక్ ప్రస్తుతం ఐసీయూ (ICU) లో చికిత్స పొందుతున్నారు. బాధితుడి తమ్ముడు రిటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య ప్రియ, జిమ్ ట్రైనర్ ప్రతాప్‌లపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాంగ్రెస్‌పై మోదీ సెటైర్.. బ్యాలెట్ పేపర్‌తో ఎన్ని సీట్లు వచ్చాయంటూ పోస్ట్
పంజాబ్‌లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి