ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు బుల్డోజర్లతో స్వాగతం
ABN , Publish Date - Sep 21 , 2026 | 02:37 PM
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం లభించింది. యూపీ ప్రభుత్వం ఆయనకు బుల్డోజర్లతో స్వాగతం పలికింది.
ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్లతో ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన యూపీకి వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) నితిన్ నబీన్ పర్యటన సాగనుంది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రానికి విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిని యూపీ సర్కార్ వినూత్నంగా స్వాగతించింది. మీరఠ్ టోల్ ప్లాజీ వద్ద బుల్డోజర్లతో వెల్‌కమ్ చెప్పింది.
ఆ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక కసరత్తులు చేస్తోంది. పశ్చిమ యూపీపై దృష్టి సారించిన ఆ పార్టీ.. ఎన్నికల వ్యూహాల రచనలో పడింది. ఇందుకోసమే నితిన్ నబీన్ పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు మేరఠ్‌లోని ఐఎన్ఏ అమరవీరుల స్మారక చిహ్నానికి నివాళులర్పించనున్నారు. అలాగే సుభార్తి యూనివర్సిటీలో 'యువ సమ్మేళనం', 'శక్తి కేంద్ర సమ్మేళనం' కార్యక్రమాల్లో మాట్లాడనున్నారు. అనంతరం మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో నితిన్ నబీన్ భేటీ కానున్నారు. రేపటి పర్యటనలో ఆయన చారిత్రక ఔఘర్‌నాథ్, శాకంబరీ దేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి
సాహిల్ సూసైడ్ కేసు.. క్షమాపణ చెప్పిన ఐఐటీ బాంబే యాజమాన్యం
మార్కెటింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు.. వ్యవసాయ శాఖ ఆదేశాలు