మార్కెటింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు.. వ్యవసాయ శాఖ ఆదేశాలు
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:35 PM
విధుల నిర్వహణకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారిపై కేంద్ర వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ, సెప్టెంబర్ 21: కేంద్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న అనురాగ్‌పై కేంద్ర వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంది. లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.
మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సమయంలో మార్కెటింగ్ అధికారి అనురాగ్‌పై లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వేర్‌హౌస్‌లకు సబ్సిడీ నిధులు విడుదల చేసేందుకు లంచం అడిగారని ఆయనపై ఫిర్యాదులూ వచ్చాయి. శివాయ్ వేర్‌హౌస్ నుంచి రూ. 1 లక్ష, శ్రీకృష్ణ వేర్‌హౌస్ నుంచి రూ.60 వేలు అనురాగ్ డిమాండ్ చేసినట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. అలాగే అనురాగ్‌పై సస్పెన్షన్ వేటు విధించింది.
ఈ వార్తలూ చదవండి
దానం అనర్హతపై కిషన్‌రెడ్డి స్పందన సిగ్గుచేటు
విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 18 డిమాండ్లపై చర్చలు..