Share News

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన..

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:50 AM

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ నిరసన..
Ganesh Immersion Protest

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. నిమజ్జనంపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ వద్ద బైఠాయించారు. నిరసనలో భాగంగా అక్కడ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు తొలగించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు పోలీసులు కిందపడిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాల్సిందేనని భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. బారికేడ్లను తొలగించిన అనంతరం వారు అక్కడే బైఠాయించి నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ట్యాంక్ బండ్ పరిసరాల్లో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, గణేశ్ నిమజ్జనం వేళ ట్యాంక్ బండ్ వద్ద ఆంక్షలపై ఉత్సవ సమితి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, ట్యాంక్ బండ్ వద్ద సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్ ఉప్పల్‌లో దారుణ ఘటన.. తల్లి సమక్షంలోనే బాలికపై అత్యాచారం..

దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ

Updated Date - Sep 21 , 2026 | 11:57 AM