దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై బుధవారం సుప్రీంలో విచారణ
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:18 AM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై దానం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం(సెప్టెంబర్ 23) విచారణ జరపనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ దానం నాగేందర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. దానంపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి...
రూ.200 చిల్లర విషయంలో వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య..
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News