విద్యార్థులను కలిసిన ఐఐటీ బాంబే యాజమాన్యం.. 18 డిమాండ్లపై చర్చలు..
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:28 AM
ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సాహిల్ మృతి నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT Bombay) విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. సాహిల్ మృతి నేపథ్యంలో విద్యార్థులు మూడు రోజులుగా నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ షిరీష్ కేదారే, నిరసనకారులతో సుదీర్ఘంగా సమావేశమై వారి 18 డిమాండ్లపై చర్చించారు (IIT Bombay protest).
విద్యార్థులు సమర్పించిన 18 అంశాల జాబితాపై ఆదివారం అర్ధరాత్రి దాదాపు మూడు గంటలపాటు చర్చ జరిగింది. అకడమిక్ కమిటీలలో విద్యార్థులకు ప్రాతినిధ్యం కల్పించడం, క్యాంపస్‌లో జరిగిన నాలుగు ఆత్మహత్యలపై స్వతంత్ర విచారణ జరపడం, ప్రొఫెసర్ల మానసిక ఆరోగ్యం కోసం వర్క్‌షాప్‌లు నిర్వహించడం వంటి అంశాలు ఈ డిమాండ్లలో ఉన్నాయి. ఈ డిమాండ్లపై అధికారిక ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది (IIT Bombay student death).
విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముంబై పవాయి పోలీసులు ఇప్పటికే ప్రొఫెసర్ సూర్యనారాయణ్ దుల్లాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు (IIT Bombay 18 demands). అలాగే, ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద మరో కేసు పెట్టారు. సాహిల్ మరణానికి దారితీసిన పూర్తి పరిస్థితులు, విద్యార్థులు చేసిన ఆరోపణలు, సంస్థ వివరణ వంటి అంశాలపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..