దానం అనర్హతపై కిషన్‌రెడ్డి స్పందన సిగ్గుచేటు
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:42 AM
దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ చేయించే ఫిరాయింపులపై మాట్లాడాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అయితే ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అనర్హత అంశంపై మాట్లాడే ముందు దేశవ్యాప్తంగా బీజేపీ సాగించే ఫిరాయింపులపై కిషన్‌రెడ్డి స్పందిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీలను చీల్చి బహిరంగంగా ప్రజాప్రతినిధుల కొనుగోళ్లకు పాల్పడే బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.