నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం సేవించి 19 మంది మృతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:04 PM
నాగాలాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద కల్తీ మద్యం సేవించి 19 మంది మృతి చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: నాగాలాండ్‌లో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద కల్తీ మద్యం సేవించిన తర్వాత 2 రోజుల వ్యవధిలో 19 మంది మృతి చెందారు. మృతుల్లో మొకోక్‌చుంగ్ జిల్లాకు చెందినవారు 8 మంది, తుయెన్సాంగ్ జిల్లావాసులు 11 మంది ఉన్నారు.
ఈ విషాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఏఎస్పీ బుంగ్‌లాంగ్ చాంగ్ నేతృత్వంలో ఈ బృందం పనిచేయనుంది. అనుమానిత కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారు? దాని వెనుక అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నరు. ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక అనంతరం మరణాలకు గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
ఈ ఘటనతో పోలీసులు ఆ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్ చేసి, సుమారు 3 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానిత కల్తీ మద్యం సరఫరా మార్గాన్ని అరికట్టే దిశగా అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కాగా..1990 నుంచి నాగాలాండ్‌లో మద్య నిషేధ చట్టం అమల్లో ఉంది. అయినప్పటికీ అక్రమ మద్యం సరఫరాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని, లేబుల్ లేని అనుమానాస్పద అక్రమ మద్యాన్ని సేవించొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.
ఇవీ చదవండి:
కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి.. గురుగ్రామ్‌లో విద్యార్థుల ఘర్షణ
ముంబై బీచ్‌లో చెత్త తొలగింపు.. రంగంలోకి దిగిన సీఎం భార్య, కుమార్తె