Share News

ముంబై బీచ్‌లో చెత్త తొలగింపు.. రంగంలోకి దిగిన సీఎం భార్య, కుమార్తె..

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:56 PM

గణేశ్‌ నిమజ్జనం అనంతరం ముంబైలోని జుహూ బీచ్‌ వద్ద ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృత, కుమార్తె దివిజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముంబై బీచ్‌లో చెత్త తొలగింపు.. రంగంలోకి దిగిన సీఎం భార్య, కుమార్తె..
Amruta Fadnavis, Divija Fadnavis

ఇంటర్నెట్ డెస్క్: గణేశ్‌ నిమజ్జనం అనంతరం ముంబైలోని జుహూ బీచ్‌ వద్ద ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ భార్య అమృత, కుమార్తె దివిజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సీ షోర్‌ షైన్‌ 2026' కార్యక్రమంలో భాగంగా శనివారం జుహూ తీరంలో భారీగా క్లీన్ అప్ కార్యక్రమం చేపట్టారు (Amruta Fadnavis Juhu Beach clean up).


అనంత చతుర్దశి సందర్భంగా శుక్రవారం ముంబైలో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం జరిగింది. మరుసటి రోజే జుహూ బీచ్‌లో సముద్ర తీరాన్ని శుభ్రం చేసేందుకు 'సీ షోర్‌ షైన్‌ 2026' కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం భార్య అమృత, దివిజ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించారు. దివ్యాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 'సీ షోర్‌ షైన్‌' కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు (Sea Shore Shine 2026).


సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం (Mumbai beach clean up). గతంలోనూ ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. 2024లో వెర్సోవా బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి 3,000 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు హాజరైనట్లు దివ్యాజ్‌ ఫౌండేషన్‌ తెలిపింది.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 12:56 PM