కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి.. గురుగ్రామ్‌లో విద్యార్థుల ఘర్షణ
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:13 PM
గురుగ్రామ్‌లోని ఐఐఎల్ఎమ్ యూనివర్సిటీ వెలుపల విద్యార్థుల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొందరు థార్ కార్‌లో వచ్చి విద్యార్థులపై దాడికి దిగినట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లోని ఐఐఎల్ఎమ్ యూనివర్సిటీ వెలుపల తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కొందరు థార్ కార్‌లో వచ్చి విద్యార్థులపై దాడికి దిగినట్టు తెలుస్తోంది. మొదట ఓ విద్యార్థిని వారు కారుతో ఢీ కొట్టారని, ఆ తరువాత అతడిని క్రూరంగా హింసించారని సమాచారం. దీంతో ఆ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి చేసిన వ్యక్తులు మహిళా విద్యార్థులపై కూడా హింసకు పాల్పడ్డారని తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు థార్‌లో వచ్చిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
స్టూడెంట్స్ గ్రూప్స్ మధ్య మొదలైన ఘర్షణ ఈ ఘటనకు దారితీసింది. బాధిత విద్యార్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. కాగా ఘర్షణలకు పాల్పడ్డ ఆరుగురి మీద సదరు విద్యాసంస్థ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
ఈ వార్తలూ చదవండి
హోర్ముజ్ కాదు.. ట్రంప్ జలసంధి.. పేరు మారుస్తూ అమెరికా అధ్యక్షుడి పోస్ట్..
భజన్ క్లబ్బింగ్‌లో ప్రధాని మోదీ.. అద్భుతమంటూ ప్రశంస